
విజయవాడ రూరల్ పరిధిలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
బందోబస్త్ విధులు నిర్వహించు పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి విధులపై దిశా నిర్ధేశం చేసిన సెంట్రల్ ఏ.సి.పి. దామోదర్
గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 మొదటి దశలో భాగంగా రేపు (26.11.2026) జరగనున్న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డి.సి.పి. కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్. జి.రామ కృష్ణ నేత్రుత్వంలో విజయవాడ రూరల్ పరిధిలో పటిష్ఠమైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
బందోబస్త్ సిబ్బందికి బందొబస్త్ విధులపై సెంట్రల్ ఏ.సి.పి. దామోదర్ దిశా నిర్ధేశం బందోబస్తు విధులకు కేటాయించిన సిబ్బంది ఈరోజు ఆయా మండల కేంద్రాల్లో రిపోర్ట్ చేశారు. ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు. సిబ్బంది అంతా క్రమశిక్షణతో, అప్రమత్తంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని ఏ.సి.పి ఆదేశించారు.
ఈ క్రమంలో ప్రజలకు, అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు పోలీసుల ముఖ్య సూచనలు – హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అందరూ సహకరించాలి. అల్లర్లు, గొడవలకు తావివ్వకుండా సంయమనం పాటించాలని, ప్రజాశాంతికి భంగం కలిగించినా, ఉద్రిక్తతలు సృష్టించినా అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని చట్టప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి ఓటర్లు, అనుమతి పొందిన ఎన్నికల సిబ్బంది తప్ప ఇతరులెవరూ రాకూడదు. ఈ పరిధిలో గుమికూడినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫేస్ రికగ్నిషన్ (FRS) కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం. నిబంధనలు ఉల్లంఘించే వారిని కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించి శిక్షించడం జరుగుతుందని, యువత ఓటు వేసిన వెంటనే పోలింగ్ కేంద్రాల వద్ద ఉండకుండా ఇళ్లకు వెళ్లిపోవాలి. అనవసర గొడవల్లో చిక్కుకుని పోలీసు కేసులు నమోదైతే భవిష్యత్తులో విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని గుర్తించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు.
అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత గానీ, ఫలితాలు వెలువడిన తర్వాత గానీ విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం. నగరంలో 163 బి.ఎన్.ఎస్. ఎస్. యాక్ట్ అమలులో ఉన్నందున ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది జనం గుమిగూడరాదు. నిభందనలు మీరితే నిర్వాహకులు, పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఫలితాల అనంతరం కూడా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ కొనసాగుతాయని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ, ప్రజాస్వామ్య పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరుతున్నాము.
![]()
