
రోడ్డు ప్రమాద బాధితురాలికి రూ 7.42 లక్షల ఎల్ ఓ సీ మంజూరు
ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేత
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్తపేటకు చెందిన గూడెల చిన్మయి (23) వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన
ఎల్ ఓ సీ ను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు
49 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్ , 47 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఈగల సాంబశివరావు, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు తో కలిసి అందజేశారు
బ్రాహ్మణ వీధికి చెందిన గూడెల చిన్మయి రోడ్డు ప్రమాదంలో గాయపడి అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన ఎల్ ఓ సీ ను కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
![]()
