
డయల్ 112 కాల్తో అప్రమత్తం: ప్రకాశం బ్యారేజ్ వద్ద తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన పోలీసులు
ఈ రోజు ఉదయం గుంటూరుకి చెందిన మహిళ కుటుంబ సమస్యల నేపథ్యంలో మనస్తాపానికి గురై తన రెండు సంవత్సరాల పాపతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లినట్లు డయల్ 112 కు కాల్ చేసి పోలీస్ కంట్రోల్ రూం హెచ్.సి. 1524 శ్రీ సుబ్బారావు కు సమాచారం అందించారు.
హెచ్.సి. 1524 శ్రీ సుబ్బారావు ద్వారా సదరు సమాచారం తెలుసుకున్న పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వి.దుర్గారావు గారు వెంటనే అప్రమత్తమై కమాండ్ కంట్రోల్ నందు ఉన్న సి.సి.కెమెరాల ద్వారా ఆమె తన పాపతో కలిసి ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఉందని గుర్తించి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ గుణారామ్ గారికి సమాచారం అందించినారు.
సమాచారం అందుకున్న తక్షణమే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ గుణారామ్ గారు వారి సిబ్బంది అయిన పి.సి.2792 శ్రీ గురువులు మరియు హెచ్.జి.177 అబ్దుల్ జలీల్ లను పంపగా వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహిళను, పాపను గుర్తించి సురక్షితంగా రక్షించారు.
అనంతరం సదరు మహిళకు మరియు ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. అనంతరం ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రజల శ్రేయస్సు – భద్రతే ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ వారి లక్ష్యం అని ఈ సందర్భంగా శీఘ్రంగా (వెంటనే) స్పందించి మహిళ ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వి.దుర్గారావు గారిని, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ గుణారామ్ గారిని వారి వారి సిబ్బందిని నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ప్రత్యేకంగా అభినందించారు.
![]()
