రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సమ్మెట సాంబశివరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు

Spread the love

రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సమ్మెట సాంబశివరావు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమ్మెట సాంబశివరావు  మాట్లాడుతూ,రామవరప్పాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ ప్యానెల్‌కు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి మరియు వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో అభ్యర్థులందరూ ఘన విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.విజయవాడ రూరల్ మండల నాయకులు కొమ్ము కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వార్డు సభ్యులు కాకర్లమూడి సువర్ణరాజు , మెండే సుధాకర్, అల్లాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Loading