ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా కల్పిస్తుంధి-MLA బొండా ఉమ

0

31-7-2025

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా కల్పిస్తుంధి-MLA బొండా ఉమ

ప్రజలకు తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటారన్నారు -MLA బొండా ఉమ

ధి :-31-7-2025 గురువారం ఈరోజు విజయవాడ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 58,59,63,64 డివిజన్ లకు చెందిన అనారోగ్యంతో బాధపడి ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేపించుకున్నటువంటి బాధితులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు గారు ముఖ్యమంత్రి సహాయనిధి ₹7 లక్షల 25వేల రూపాయలు (CMRF ) చెక్కులను 15 మంది కి బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాలతో వైద్యం పేదలకు అందని ద్రాక్ష లాగా మారిందని, ప్రభుత్వ వైద్యం పేదలకు దూరం చేయడంతో పాటు ప్రైవేటు కార్పొరేట్ వైద్యాన్ని అతి ఖరీదైన వైద్యంగా తయారు చేయడమే కాకుండా వ్యక్తిగత సులాభం కోసం వారిని ప్రోత్సహించి సామాన్యులకు పేదలకు  ప్రైవేటు వైద్యం అందుబాటులో లేకుండా భారీగా ఖరీదైన వైద్యంగా తయారు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కీలకపాత్ర వహించిందని బొండా ఉమా విమర్శించారు

ఆనాడు 2014 నుండి 2019 వరకు ప్రభుత్వ వైద్యశాలలు డివిజన్ పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలు అనేక రకాలైన వైద్యాలకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను ఇచ్చి వారి ఆరోగ్య బాగోవులను చూసుకున్న ప్రభుత్వం చంద్రబాబునాయుడు ప్రభుత్వం అని తాను ఆనాడు ఎమ్మెల్యే గా ఉండి సెంట్రల్ నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేపించుకున్న వేలాదిమందికి కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి గా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు…

ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులను అధునాతనమైన పరికరాలతో మంచి వైద్యం అందించడమే కాకుండా డివిజన్ల స్థాయిలో ఉన్న 14 ప్రాథమిక వైద్యశాలలలో  ఉన్నతమైన డాక్టర్లను నియమించి పూర్తి స్టాఫ్ ను ఏర్పాటు చేసి ఉచితముగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తూ  ప్రాథమిక వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామని, అదేవిధంగా కార్పొరేట్ వైద్యశాలలలో, ప్రైవేటు వైద్యశాలలలో, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలలో అనారోగ్యానికి గురై వైద్యం చేపించుకొన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో నాకు అప్లై చేసుకున్న వారి అందరికీ సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో చెక్కులను ఇస్తూ వారిని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆదుకుంటూ ఉన్నానని భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి వైద్యం అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతుందని సెంట్రల్ నియోజకవర్గం లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను, కార్పొరేషన్ పరంగా ఉన్న వైద్యశాలలను అభివృద్ధి చేసి అందరికీ ఆరోగ్యకరమైన మంచి వైద్యాన్ని అందించెందుకు కృషి చేస్తున్నానని తెలిపారు

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయ కార్యదర్శి  ఘంటా కృష్ణమోహన్, 58 వ డివిజన్ అధ్యక్షులు కూర్మాపు దుర్గారావు, 59వ అధ్యక్షులు రాజాన బంగారు నాయుడు, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, 58వ డివిజన్ ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్,59వ డివిజన్ ఇంచార్జి SK. జాన్ వలి, 63వ డివిజన్ ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, 64 డివిజన్ ప్రధాన కార్యదర్శి SK బాబు,63,62 క్లస్టర్ ఇంచార్జ్ బత్తుల కొండ, మరక శ్రీనివాస్, 63వ డివిజన్ ఇంచార్జ్ మోత్కూరి కాసిం, 58వ డివిజన్ ఇంచార్జి పిరియ సోమేశ్వరరావు, 62వ డివిజన్ ఇంచార్జి పైడి శ్రీను,సుర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, మల్లంపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version