మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చిట్ చాట్సు

0

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్

సింగ్ నగర్ లోని  మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చిట్ చాట్సు

మారు రూ.55 కోట్లతో స్టేడియం రూపురేఖలు మార్పు…

విజయవాడ అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తోఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వాకర్స్ తో వాక్ చేస్తూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వాకర్స్ కు తెలియజేశారు. ఫ్యాన్  గుర్తుపై ఓటు వెయ్యాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. వెల్లంపల్లి మాట్లాడుతూ… మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకింగ్ ట్రాక్, వ్యాయామశాలకు రూ. 25 కోట్ల , ఇండోర్ స్టేడియం మరమ్మత్తులు నిమిత్తం 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రాచీన యుద్ధకళ విద్యను అభ్యసిస్తున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. మరుగవుతున్న ప్రాచీన యుద్ధ కళ విద్యను  యువతీ యువకులు నేర్చుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రాచీన యుద్ధకళ విద్య కోచ్ విజయ్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్  శైలజా రెడ్డి మాట్లాడుతూ… గత టిడిపి ప్రభుత్వంలో మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియం ని పూర్తిగా క్రీడాకారులకు అందుబాటులో లేకుండా నాశనం చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్టేడియం రూపురేఖలు మార్పు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. యువతి యువకులను క్రీడారంగంలో ఎక్కువగా ప్రోత్సహించేది సీఎం జగన్ ప్రభుత్వమేనని మరొకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాకినేని బసవ పున్నయ్య స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరాజు, ఎంబీజీఎం ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version