బాప్టిస్ట్ పాలెం సమస్యలను పరిష్కరిస్తా సుజనా చౌదరి

0

 బాప్టిస్ట్ పాలెం సమస్యలను పరిష్కరిస్తా సు

జనా చౌదరి 

బాప్టిస్ట్ పాలెం ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. డాక్టర్ కటికల మనోజ్ ఆధ్వర్యంలో 35వ డివిజన్లో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బాప్టిస్ట్ పాలెం వాసుల సమస్యలను పరిష్కరిస్తారని వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. వారు కోరినట్లుగా 35వ డివిజన్ ప్రాంతానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి అయిన వెంటనే సుజనా ట్రస్ట్ నుంచి మిని ఎలక్ట్రికల్ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. మంత్రిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 35 వ డివిజన్ టిడిపి అధ్యక్షురాలు నందకుమారి బిజెపి మహిళా నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి జనసేన డివిజన్ అధ్యక్షులు అరవ ప్రదీప్ టిడిపి నాయకులు ఇత్తడి చార్లెస్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు హర్షియా బిజెపి టిడిపి జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version