ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలి ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి

0

 ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలి 

ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అనుసరించి ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు ప్రజలకు విజ్ఞప్తి చేసినారు.

ఒక పార్టీపై ఉన్న అభిమానంతో ఎదుట పార్టీ వారిని విమర్శించడం గాని ఎదుట పార్టీ వారి పట్ల దుష్ప్రచారాలు చేయడం గానీ అసత్య ప్రచారాలు చేస్తూ వారి యొక్క మనోభావాలకు ఇబ్బందులు కలిగే విధంగా నడుచుకో రాదని, ఎన్నికల ర్యాలీలలో రాజకీయ పార్టీలు వారు 18 సంవత్సరాల లోపు పిల్లలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని,

ఎలక్షన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన ఎడల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని,

ఎవరైనా ఎలక్షన్ కేసులలో ఉంటే వారి యొక్క బంగారు భవిష్యత్తు పాడవుతుందని భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని విదేశాలకు వెళ్లాలన్న ఈ కేసులు వలన ఇబ్బందులు పడతారని,

ఎలక్షన్ సమయాలలో నమోదు చేసే క్రిమినల్ కేసులలో ఉన్నటువంటి వారిపై రౌడీషీట్లను ఓపెన్ చేస్తారని,

ఎలక్షన్ కేసులలో ఉన్న వారిపై ప్రతి ఎలక్షన్ కు బైండోవర్ కేసులను నమోదు చేస్తారని,

పచ్చని గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించుకొనడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version