బీసీ లకు కూటమి భరోసా సుజనా చౌదరి

0

 బీసీ లకు కూటమి భరోసా సుజనా చౌదరి

 

బిసి లకు బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి  అన్నారు.

 మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ  వైసిపి ఐదేళ్ల పాలనలో బీసీలకు రక్షణ కరువైందన్నారు. బిసి ల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు  34 సంక్షేమ పథకాలు అమలు చేస్తే   జగన్ వాటిని రద్దు చేశాడన్నారు. గత ఐదేళ్లలో బీసీలపై అనేక దాడులు హత్యలు జరిగాయని వీటన్నింటికీ జగన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. ఎన్డీయే కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీలకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీసీలందరూ అండగా నిలబడి కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు బాబు రాజేంద్రప్రసాద్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ బుద్దా వెంకన్న టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్  ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్రావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ ఎలగల నూకాలమ్మ  బిజెపి నాయకులు పైలా సోమినాయుడు బీసీ సంఘం ప్రతినిధులు ఎరుబోతు రమణ బాయిన శేఖర్ బాబు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ కునుకు రాజశేఖర్ కనకాచారి గుండారపు హరిబాబు పోతిన బేసుకంటేశ్వరుడు బిజెపి టిడిపి జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version