ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం శాసనసభ్యులు సుజనా చౌదరి

0

 ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 

శాసనసభ్యులు సుజనా చౌదరి 

ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. 52వ డివిజన్ కొత్తపేట లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మెట్లు, సైడ్ కాలువలకు రూ 19  లక్షలతో చేపట్టనున్న నిర్మాణం 53 వ డివిజన్ పరిధిలో సుబ్బరామయ్య వీధి నుండి హిందూ హైస్కూల్ వరకు రూ 62 లక్షలతో చేపట్టనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు  శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ  నిర్మాణ పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆరు నెలల కూటమిపాలనలో అహర్నిశలు, శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ  సుజనా చౌదరి పార్టీలకతీతంగా పనిచేస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పశ్చిమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అధికారులు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, ఎయి రామకృష్ణ, ఇయి వెంకటేశ్వరరెడ్డి, కూటమి నేతలు బొమ్మసాని సుబ్బారావు ,అడ్డూరి శ్రీరామ్, ఎంఎస్ బైగ్, అమ్మిశెట్టి వాసు, కొప్పిరెడ్డి ఎస్ ఎన్ మూర్తి,ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మహాదేవు అప్పాజీ రావు, మరుపిళ్ల రాజేష్, బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ, ఆర్షద్, మైలవరపు దుర్గారావు, అత్తులూరి పెదబాబు, మైలవరపు కృష్ణ, బోగవల్లి శ్రీధర్, తిరుపతి అనూష, పైలా సురేష్, తిరుపతి సురేష్, ఈగల సాంబ, కనకరావు,  వివిధ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version