కార్టీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో కోటి దీపోత్సవంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన

0

 కార్టీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

మంగళగిరిలో కోటి దీపోత్సవంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన

కాలినడకన వెళ్లి గండాల నరసింహస్వామి దర్శించుకున్న మంత్రి

మొక్కులు తీర్చుకుని గండ దీపం వెలిగించిన మంత్రి లోకేష్

మంగళగిరిః కార్టీక పౌర్ణమి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళగిరిలోని దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర గాలి గోపురం వద్ద ఓంశ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోటిదీపోత్సవంలో పాల్గొని అఖండ కోటి దీపం వెలిగించారు. ముందుగా కోటిదీపోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి పండితులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ పానకాల లక్ష్మీనరసింహ ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి మెట్లమార్గంలో కాలినడకన వెళ్లి కొండ శిఖరాగ్రాన కొలువై ఉన్న గండాలయ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకుని గండ దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. గండాలయ స్వామి కొండకు మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version