పూర్వ వైభవం దిశగా రీజినల్ సైన్స్ సెంటర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 పూర్వ వైభవం దిశగా రీజినల్ సైన్స్ సెంటర్ 

ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడంతో

పాటు యువతలో వైజ్ఞానిక స్ఫూర్తిని కలిగించేందుకు విజయవాడ భవానిపురంలో 2005 నుంచి అందుబాటులో ఉన్న రీజినల్ సైన్స్ సెంటర్ (ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం) అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి నడుం బిగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన మండలి ద్వారా నిర్వహించబడుతున్న ఈ విజ్ఞాన కేంద్రంలో క్రమం తప్పకుండా వర్క్ షాప్ లు, విద్యా కార్యక్రమాలు, సైన్స్, ప్లానిటోరియం ప్రదర్శనలు, మరియు గణిత విద్యపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఈ విజ్ఞాన కేంద్రంలో 34 కొత్త శాస్త్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి విద్యార్థుల శాస్త్ర అవగాహనను పెంపొందించడానికి పునరుత్పాదక శక్తి, అంతరిక్ష ప్రయాణం, రోబోటిక్స్ వంటి అనేక ఆధునిక అంశాలపై ప్రదర్శనలిస్తున్నాయి. 

కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని ప్రణాళికలో భాగంగా త్రీడీ థియేటర్, డిజిటల్ ప్లానిటోరియం, మ్యూజిక్ మరియు లైటింగ్ తో కూడిన వాటర్ ఫౌంటెన్ , సింథటిక్ స్పోర్ట్స్ సైన్స్ ఫెసిలిటీ, యువతలో అంతరిక్షం పట్ల అవగాహన పెంపొందించడానికి అంతరిక్ష ప్రదర్శనలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు.

 ఈ రీజినల్ సైన్స్ సెంటర్ లో పాఠశాల, కళాశాల విద్యార్థులకు , ఉపాధ్యాయులకు అన్ని వయసుల వారికి ఇండోర్ మరియు అవుట్ డోర్ అన్వేషణకు ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 

 గత ఏడాదిలో వచ్చిన వరదల వలన సైన్స్ సెంటర్ నిర్వహణకు అంతరాయం కలిగింది.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సోమవారం రీజినల్ సైన్స్ సెంటర్ మెంబర్ సెక్రెటరీఅండ్ సీ.ఈ.ఓ ప్రొఫెసర్ కే శరత్ కుమార్ ను కలిశారు. సైన్స్ సెంటర్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.ఎమ్మెల్యే సుజనా చౌదరి రీజినల్ సైన్స్ సెంటర్ ను అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version