ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ అమలుపై సమీక్ష

0

 ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ అమలుపై సమీక్ష 

శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన ఇంద్రకీలాద్రి క్షేత్రం అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, మాస్టర్ ప్లాన్ అమలు గురించి అధికారులతో సోమవారం ఈఓ సీనా నాయక్ 

సమీక్ష నిర్వహించారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు సుజనా చౌదరి ఆధ్వర్యంలో గతంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించగా

 ఆయన సూచనల మేరకు సోమవారం ఈ ఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు.

ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు , అన్నదానం, ప్రసాదాల పోటు ,ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులు, భక్తులకు మౌలిక వసతుల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని విడతలవారీగా పెండింగ్ లో ఉన్న పనులను చేపట్టి వచ్చే విజయదశమి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.

ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, ఈ ఓ శీనా నాయక్ ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి పలు సూచనలు చేశారు. సమావేశంలో సిద్దార్ధ కళాశాలల డైరెక్టర్ పాండురంగారావు, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కోటేశ్వరరావు, వైకుంఠరావు, రిటైర్డ్ ఎస్ ఈ ఉదయ్ కుమార్, రిటైర్డ్ ఈ ఈ నారాయణమూర్తి, డీ సీ పీ చంద్రబోస్, ఆలయ అధికారులు సిబ్బంది

పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version