పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యం మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మిక భద్రతా ప్రమాణాలను

0

విజయవాడ, 11.06.2025 పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో కార్మిక భద్రత అంతే ముఖ్యం మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మిక భద్రతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లేందుకు, BIS విజయవాడ శాఖ వారు “సామర్ధ్యాభివృద్ధి కార్యక్రమం మరియు గట్టి భద్రతా ఆడిట్ శిక్షణ (IS 14489:2018 ప్రకారం)” కార్యక్రమాన్ని బుధవారం విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక శాఖ కమిషనర్ ఎం. వి. శేషగిరి బాబు మరియు BIS విజయవాడ శాఖ కార్యాలయ డైరెక్టర్ మరియు హెడ్ ప్రేమ్ సజని పాట్నాల హాజరయ్యారు.రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, BIS వారు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం వలన అధికారులకు పరిశ్రమల సురక్ష పద్దతుల తనిఖి కొరకు వారు అనుసరిస్తున్న విధానాలపై మరింత అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే కొన్ని ప్రమాదాలు జరిగాయని, అందులోను సినర్జీ కంపెనీ లో భారిస్తాయిలో ప్రాణనష్టం జరిగిందని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై నివేదిక ఇవ్వాలని వసుధా మిశ్రా కమిటిని ముఖ్యమంత్రి . నారా చంద్ర బాబు నాయుడు నేతృత్వంలో నియమించిన విషయాన్నీ గుర్తుచేసారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలి అని ఆలోచిస్తున్న సమయంలో పలు అధికారుల చొరవతో అవసరమైన చర్యలన్నీ చేపట్టామని, ప్రమాద నివారణ కొరకు ఏర్పాటు చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని వేగవంతంగా అధికారులు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతముఖ్యమో కార్మికుల యొక్క ఆరోగ్యం, భద్రత మరియు వారి నైపుణ్యాలను పెంచే భాద్యత కూడా అంతే ముఖ్యమన్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్న BIS శాఖ వారికీ కృతఙ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందనన్నారు కార్మిక శాఖ కమిషనర్ ఎం. వి. శేషగిరి బాబు మాట్లాడుతూ, BIS రూపొందించిన విధానాలు, IS 14489: 2018 ప్రకారం భద్రతా చర్యలు గురించి వివరించారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులుకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినట్లయితే వారు ప్రమాదాల గురించి ఆలోచించకుండా ఉత్పాదకతను పెంపొందించే దిశగా పనిచేస్తారని తెలిపారు. పటిష్టమైన సురక్ష పద్దతులను అవలంబించడం వలన పరిశ్రమల యాజమాన్యానికి ఆస్తి నష్టం మరియు ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త వహించవచ్చని పరిశ్రమల యాజమాన్యం కూడా సురక్షిత పద్దతులను అమలు చేసే విధానాలలో ఎలాంటి అశ్రద్ధ వహించాకుడదని అన్నారు. అధికారులు పరిశ్రమలలో ఎలాంటి సురక్షా పద్ధతులను అవలంబిస్తున్నారు, ఏయే ప్రదేశాలలో అమలుచేస్తున్నారు వంటి అంశాలపై ఖచ్చితమైన తనిఖి నిర్వహించాలని సూచించారు. అటు పరిశ్రమలు, కార్మికులు ఇటు అధికారులు అందరూ సమన్వయం తో సురక్షిత విధానాలను అవలంబించడం ద్వార ప్రమాదాలను నివారించి ఉత్పాదకతను పెంపొందించవచ్చు అని తెలిపరు.విజయవాడ శాఖ కార్యాలయ డైరెక్టర్ మరియు హెడ్ ప్రేమ్ సజని పాట్నాల, కార్మిక భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిపుణురాలు భావనా కస్తూరియా వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) ఎంపిక మరియు ప్రమాదకరమైన పని వాతావరణాన్ని నివారించేందుకు భద్రతా పరికరాల ప్రమాణాలు పెంచవలసిన రంగులు, గుర్తులు, ప్రమాద నివారణ ట్యాగ్ల గురించి సమగ్ర వివరణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నరేంద్ర IS 14489:2018 ప్రకారం భద్రతా ఆడిట్ నిర్వహణపై సమగ్ర శిక్షణను అందించారు. BIS దక్షిణ ప్రాంతం మాజీ ఉప డైరెక్టర్ జనరల్ యు.ఎస్.పి. యాదవ్, ఆడిట్ విధానాలు మరియు ప్రమాణలను మెరుగుపరిచే దిశలో వివరణాత్మకంగా మాట్లాడారు. సుమారు 45 మంది ప్రముఖ ప్రతినిధులు, పరిశ్రమల ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు, BIS అధికార ప్రతినిధులు కార్మిక భద్రతను ప్రోత్సహించే భారతీయ ప్రమాణాలు గురించి విస్తృతంగా చర్చించారుకార్యక్రమంలో భాగంగా కర్మాగార శాఖ వారు APCFSS వారి సహకారంతో రూపొందించిన “factories” యాప్ ను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ యాప్ మొదటి దశలో బాగంగా థర్డ్ పార్టీ సేవలను అనగా తనిఖి, పరికరాల పర్యవేక్షణ వంటి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కర్మాగార శాఖ డైరెక్టర్ .యస్.ఉషశ్రీ తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version