పశ్చిమ లో సమగ్రాభివృద్దే ధ్యేయం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు

0

 పశ్చిమ సమగ్రాభివృద్దే ధ్యేయం 

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆ

దేశాల మేరకు 

పశ్చిమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, పారిశుద్ధ్య, సచివాలయాల, సిబ్బంది, టౌన్ ప్లానింగ్, అధికారులతో కలిసి శుక్రవారం 44 వ డివిజన్ పర్యటన చేపట్టారు. నియోజకవర్గ సమగ్రాభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని గత వైసిపి పాలనలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే సుజనా ఆదేశాలతో డివిజన్ పర్యటనలో క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. 44వ డివిజన్లోని చెరువు సెంటర్, అప్పలస్వామి క్వారీ, రామరాజ్యనగర్, ప్రాంతాలలో నెలకొన్న మంచినీరు, రోడ్లు, వీధిదీపాలు, డ్రెయిన్ల సంబంధిత, సమస్యలను ఆయా అధికారుల పర్యవేక్షణలో తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. ఏ చిన్న సమస్య ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ రవీంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరావు, ఏఈ అహ్మద్ నాయకులు టిడిపి డివిజన్ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, జనసేన లింగం శివప్రసాద్, లింగాల అనిల్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version