ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ

0

 ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ

నియోజకవర్గంలోని మూడు అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 న పున: ప్రారంభించడానికి పనులను వేగవంతం చేసామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి శుక్రవారం కాళేశ్వర రావుమార్కెట్, భవానిపురం, హెచ్ బి కాలనీలలోని, అన్నా క్యాంటీన్ల భవనాలను ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఇతర అవసరాలకు వినియోగించిన అన్నా క్యాంటీన్ భవనాలను ఆధునికరించి అతి త్వరగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. అన్నా క్యాంటిన్లు ప్రారంభమైతే రోజువారి కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వంటి వారికి తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందుతుందన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఎన్డీయే కూటమి ప్రభుత్వం పునరుద్ధరించడం పై ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంలోని, అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో, స్వాతంత్ర్య దినోత్సవం నాటికి, అన్నా క్యాంటీన్లను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే పనులు చివరి దశకు చేరుకున్నాయని జోనల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version