నిర్మాణ వ్యర్ధాల తొలగింపు కు ట్రాక్టర్ యజమానులతో అవగాహన ఒప్పందం

0

 విజయవాడ నగరపాలక సంస్థ 

25-02-2025

 నిర్మాణ వ్యర్ధాల తొలగింపు కు ట్రాక్టర్ యజమానులతో అవగాహన ఒప్పందం

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు

 నిర్మాణ వ్యర్ధాలు సర్కిల్ పరిధిలో ఎప్పటికప్పుడు తొలగాలన్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర  ఆదేశాల మేరకు  అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, ప్రైవేట్ ట్రాక్టర్ యజమానులతో  నిర్మాణ వ్యర్ధాలు ఎప్పటికప్పుడు తొలగించే విధంగా అవగాహన ఒప్పందం (MoU) కొరకు మంగళవారం ఉదయం తమ తమ సర్కిల్ కార్యాలయాల్లో  సమావేశం నిర్వహించారు.

 సర్కిల్ పరిధిలోగల పబ్లిక్ వీధుల్లో నిలువ ఉన్న భవన నిర్మాణ వ్యర్ధ పదార్థాలను తొలగించుటకు గాను రవాణా ట్రాక్టర్ యజమానులకు నగరపాలక సంస్థ మధ్య అవగాహన ఒప్పందం ద్వారా సర్కిల్ పరిధిలో గల అన్ని వీధుల యందు ఉన్న భవన నిర్మాణ వ్యర్థ  పదార్థాలను నగరపాలక సంస్థ సిబ్బంది వారి సమాచారం మేరకు వాటిని తొలగించుటకు వారి సమక్షంలో భవన యజమానులతో తొలగింపునకు  సహితుకమైన చార్జ్ వసూలు పై ట్రాక్టర్ ద్వారా తొలగించవలెనని ఈ సమావేశంలో చర్చించారు. 

 ఈ అవగాహన ఒప్పందంలో ఉన్న షరతుల ప్రకారం ఉదయం 6 గంటల నుండి ట్రాక్టర్ కార్మికులతో సహా వాహనము అందుబాటులో ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రమే ట్రాక్టర్ తో అనుమతించవలెనని, తొలగించిన వ్యర్థాలను  నిర్దేశించిన ప్రాంతము లో కాకుండా కాలువలో కానీ శివారు ప్రాంతపు రోడ్డు లో కానీ వెయ్యరాదని, ఒకవేళ వేస్తే ఐదు వేల రూపాయలు జరినామా విధించబడనని,  నోడల్ ఆఫీసర్ తెలియజేసిన 24 గంటల్లో సిఎన్డి వేస్టుని తొలగించాలని, మొదలగు విషయాలపై షరతులు ఉన్నాయి.

 ఈ సమావేశంలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్ర బోస్,   అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, రవాణా ట్రాక్టర్ల యజమానులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version