దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు యార్లగడ్డ
ప్రతి ఇంటికి సగర్వంగా తల ఎత్తుకొని వెళ్లండి… కార్యకర్తలకు ఎమ్మెల్యే యార్లగడ్డ పిలుపు
ఉంగుటూరు :
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని
ఉంగుటూరు మండలం ఓండ్రంపాడు, లంకపల్లి, ముక్కపాడు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముక్కపాడు గ్రామములో రూ.12 లక్షల ఖర్చుతో చల్లగుళ్ల సత్యనారాయణ స్ధలం నుండి గ్రామ సచివాలయం వరకు, మేకల సీతమ్మ ఇంటి నుండి మేకల వెంకటేశ్వరరావు ఇంటి వరకు నిర్మించిన సీసీ రోడ్లను యార్లగడ్డ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చామని ఈ పథకాన్ని ఇప్పటికీ అమలు చేసినట్లు చెప్పారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు వివరించారు. మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డ్వాక్రా మహిళలకు 13 శాతం ఉన్న వడ్డీని 11 శాతాన్ని తగ్గించి రూ. 28 వేలకోట్లు లింకేజీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలోనే గన్నవరం ప్రముఖ స్థానంలో నిలవబోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే వెంకట్రావ్ అభివృద్ధి పరంగా గన్నవరంను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ ఏడాదిపాలనలో తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదని గత వైసీపీ ప్రభుత్వ పాలకుల మాదిరిగా మట్టి దందాలు చేయలేదని ఏ ఒక్కరిమీద అక్రమ కేసులు బనాయించలేదని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో తలేత్తుకుని ప్రతి ఇంటికీ వెళ్లి సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కొలుసు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి కుందేటి చంద్రశేఖర్, మల్లెల శివరంగారావు, జల్లెడ చిన్న పుల్లయ్య, అరికట్ల రవి, మాయరా రమేష్, జల్లెడ శ్రీమనరాయణ, రామిరెడ్డి బాల కృష్ణ, కర్రే ప్రేమ కుమార్, కొండ రాంబాబు, నక్క వేరా వెంకటేశులు, టీడీపీ సీనియర్ నాయకులు కొండేటి వెంకటేశ్వరావు, అరుమళ్ళ కృష్ణ రెడ్డి, చల్లగుళ్ల షణ్ముఖ్, డీ సీ అధ్యక్షులు తుమ్మల జగదీష్, కొలవెన్ను నాగబాబు, రాజమన్నర్, దాసరి నాగేంద్ర, తెలుగు యూవత నాయకులు పరుచూరి నరేష్, కొసరాజు సాయిరాం, వంగ అయ్యప్ప రెడ్డి, బజవాడ నాగేశ్వరావు, కొమ్మినేని బాబీ, తదితరులు పాల్గొన్నారు…..