తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు

0

 :-9-12-2024

 తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు

ధి:9-12-2024 సోమవారం ఉదయం 9:30″గం నుండి” విజయవాడ మొగల్రాజపురం లోని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు ఇంటి వద్ద గాజుల బ్రదర్స్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా ఉమా పెద్ద కుమారుడు బొండా సిద్ధార్థ జన్మదినోత్సవ వేడుకలు పండితుల వేదమంత్రాల నడుమ బొండా ఉమా అభిమానుల కేరింతలతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది

 ముందుగా పుష్పాలంకరణ చేసిన వేదిక మీద బొండా సిద్ధార్థ తో నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కలిసి కేక్ కట్ చేసి అనంతరం మిఠాయిలు పంచుకోవడం జరిగినది

 ఈ సందర్భంగా విజయవాడ నగరంలోని వివిధ డివిజన్ ల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, బొండా ఉమన్న అభిమానులు, బొండా సిద్ధార్థ, బొండా రవితేజ మిత్ర బృందం తదితరులు సిద్ధార్థ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి శుభాశీస్సులు అందించడం జరిగినది

 ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ:- సెంట్రల్ నియోజకవర్గానికి తాము ఎంతో రుణపడి ఉంటామని, నియోజకవర్గ శాసనసభ్యులైన బొండా ఉమ కి మా కుటుంబానికి, తనకు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఆశీస్సులు అందించడమే కాకుండా అన్ని విషయాలలో మా కుటుంబానికి అండదండగా ఉంటూ, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 70వేలకు పైబడి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి బొండా ఉమా కి గెలుపుకి దోహద పడినటువంటి వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు

 బోండా ఉమా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరుతూ ముందుకు సాగుతామని, నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు ప్రభుత్వ పరంగా రావలసినటువంటి సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో కృత నిశ్చయంతో ముందుకు సాగుతామని, మిత్రులందరికీ నిరంతరం అందుబాటులోనే ఉంటామని, ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమమైన నియోజకవర్గముగా తీర్చిదిద్దేటువంటి విధంగా ముందుకు సాగుతామని

 ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ వారు, శ్రేయోభిలాషులు,అభిమానులు అన్ని డివిజన్ లలో వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందని వారందరికీ తాను రుణపడి ఉంటానని

 ఈ జన్మ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న వారు :- టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఘంటా కృష్ణమోహన్, మా ARTS చంటి, తదితర 21 డివిజన్ ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version