చలివేంద్రాలలో నీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు పరివేక్షిస్తుండండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

0

 విజయవాడ నగరపాలక సంస్థ 

12-03-2025

 చలివేంద్రాలలో నీటి కొరత లేకుండా ఎప్పటికప్పుడు పరివేక్షిస్తుండండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

చలివేంద్రాలలో నీటి కొరత లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరివేక్షిస్తుండండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం ఇంజనీరింగ్ సిబ్బందితో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి చలివేంద్రాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 ఈ కాన్ఫరెన్స్లో విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 77 చలివేంద్రాలలో ఎటువంటి తాగునీటి కొరత ఉండకూడదని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ త్రాగునీరు నిత్యం ప్రజలకు అందేటట్టు చూసుకోవాలని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సర్కిల్ పరిధిలో పర్యవేక్షిస్తూ తమ తమ సర్కిల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలే కాకుండా ఇంకానూ అవసరమైతే ఏర్పాటు చేయవలసిన చలివేంద్రాలు ఏమన్నా ఉన్నచో వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు చలివేంద్రాలలో తాగునీటి కొరతను ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు.

 ఇప్పుడు వరకు సర్కిల్ 1 పరిధిలో 22, సర్కిల్ 2 పరిధిలో 27, సర్కిల్ 3 పరిధిలో 28, చలివేంద్రాలు ఏర్పాటు చేయగా, చలివేంద్రాల నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పర్యవేక్షిస్తూ ఫ్లోటింగ్ జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాలలో స్టాక్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version