అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

0

 విజయవాడ నగరపాలక సంస్థ

12-03-2025

 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ తో పర్యటించి న్యూ ఆర్టీసీ కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ, తోట వారి వీధి, కోనేరు వారి వీధి, జె డి నగర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 రామాయణపు వారి వీధి, తోట వారి వీధి, కృష్ణానగర్లో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు పాతవి అయి ఉండటం వల్ల తరచుగా సమస్యలు తలెత్తడంతో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని, ఏవి రామారావు రోడ్డు పూర్తిగా పాడైపోటం గమనించి కొత్త రోడ్డు వేయాలని, అధికారులను ఆదేశాలు ఇచ్చారు. ఎన్ఎస్ఎమ్ స్కూల్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

  బోర్ వాటర్ కాకుండా అక్కడున్న ప్రజలకు రామలింగేశ్వర నగర్ నుండి కృష్ణానది నీరు అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మదర్ తెరెసా పార్క్ లో కావలసిన అని సౌకర్యాలు వసతులు కల్పించాలని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ వంటి పరికరాలతో ఆధునికరించాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమతుల పనులు సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. 

 జెడి నగర్ నగర్ లో సైడ్ డ్రైన్ లను డి సిల్టింగ్ చేస్తూ ఉండాలని, ప్రతి వార్డులో ప్రతి సచివాలయంలో డీజిల్టింగ్ పనులు ప్రతిరోజు జరుగుతూనే ఉండాలని, సెక్రటరీలు అధికారులు పర్యటిస్తున్నప్పుడు వారు డ్రైన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ డీసిల్టింగ్ ప్రక్రియను చేస్తూ ఉండాలని, వర్షాలు పడినప్పుడు రోడ్ల పైన నీళ్లు నిలవకుండా ఉండాలంటే తరచుగా కాలువల్లో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. 

 కార్పొరేటర్ ముమ్మీనేని ప్రసాద్ గారు తమ డివిజన్ లో ఉన్న సమస్యలన్నీ కమీషనర్  దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 ఈ పర్యటనలో కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ తో పాటు రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, జోనల్ కమిషనర్ కె షమ్మి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version