గాంధీ హిల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే సుజనా చౌదరి

0

 గాంధీ హిల్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. 

ఎమ్మెల్యే సుజనా చౌదరి 

మహాత్మా గాంధీ స్మారక చిహ్నంగా ఉన్న గాంధీ కొండను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. గాంధీ హిల్ (ప్లానిటోరియం )నక్షత్ర ప్రదర్శనశాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా మూతపడిన ప్లానిటోరియం సుమారు రూ 82 లక్షలతో ఆధునికరించి తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు అంతరిక్షం మరియు గ్రహ కదలికల గురించి అవగాహన కల్పించడంలో, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలను ప్లానిటోరియం అందిస్తుందన్నారు. త్వరలోనే విఎంసి అధికారులతో చర్చించి గాంధీ కొండ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమేష్ కీర్తన, సీఎం హెచ్ ఓ ఇన్చార్జి సురేష్ బాబు, ఈ యి వెంకటేశ్వర రెడ్డి, టెక్నికల్ అడ్వైజర్ నారాయణమూర్తి కూటమి నేతలు అడ్డూరి శ్రీరామ్, బుల్లా విజయ్, అర్షద్, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version