గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు వరద బాధితులకు కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మీద గవర్నర్ కి వినతి పత్రం అందజేత

0

 విజయవాడ

గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు

వరద బాధితులకు కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయం మీద గవర్నర్ కి వినతి పత్రం అందజేత

గవర్నర్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ,పి.ఏ.సి కమిటీ మెంబెర్ అసిఫ్,

వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి

వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి , మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్

విజయవాడలో వరద బాధితులకు నేటికీ నష్టపరిహారం అందలేదు

బాధితులకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం 

సాయం అందలేదని రోడ్డెక్కిన మహిళల పై లాఠీ ఛార్జి చేశారు

500 కోట్లు విరాళాలొచ్చినా సాయం అందించలేదు

వరదల పై సమాచారం ఇవ్వలేదు

వరదల్లో సాయం చేయలేదు..

వరదలు తగ్గాక కూడా న్యాయం జరగలేదు

వరద బాధితులకు సాయం అందకపోవడం పై గవర్నర్ ఆశ్చర్యపోయారు

బాధితులందకికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు

చంద్రబాబు మీ ఇంటికి వరదొచ్చింది కాబట్టి పదిరోజులు బస్సులో కూర్చున్నారు

నేటికీ పరిహారం అందించలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం 

ఇది మంచి ప్రభుత్వం కాదు చేతకాని ప్రభుత్వం 

డబ్బులు దండుకోవడానికే కానీ బాధితులకు సాయం చేయడం చేతకాదు

నలభైయేళ్ల అనుభవం అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుందా

వరద బాధితులకు సాయం అందించడానికి మీకు మనసురాదా 

మద్యం టెండర్లు…ఇసుకను దోచుకోవడానికేనా మీ ప్రభుత్వం 

వరదల్లో నష్టపోయిన ప్రతీ బాధితుడినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు,దేవినేని అవినాష్

నేటికీ సాయం అందక వరద బాధితులు ఇబ్బందిపడుతున్నారు

కలెక్టరేట్ ముందు రోజూ ధర్నాలు చేస్తున్నారు u

ఈ ప్రభుత్వానికి మైన్…వైన్ టెండర్ల పై ఉన్న దృష్టి వరద బాధితుల పట్ల లేదు

ఇన్ని రోజులైనా సాయం అందకపోవడం పై గవర్నర్ ఆశ్చర్యపోయారు

వరద బాధితుల సమస్యను…కష్టాన్ని గవర్నర్ కు వివరించాం 

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు

500 కోట్లకు పైగా విరాళాలొస్తే వాటినీ దొబ్బేశారు

దసరా ఉత్సవాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మిని అవమానపరిచారు 

ప్రోటో కాల్ ఉన్నప్పటికీ అవమానపరిచిన వారి పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరాం

సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి,మాజీ ఎమ్మెల్యే,మల్లాది విష్ణు

వరదలకు విజయవాడ ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో గవర్నర్ కు వివరించాం

వరద వస్తుందని తెలిసినా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదు 

అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతోంది 

ఎన్యుమరేషన్ అంతా తప్పుల తడక

బాధితుల వివరాలను సక్రమంగా నమోదు చేయలేదు

ఎన్యుమరేషన్ లో సగం మంది బాధితులను వదిలేశారు

కలెక్టరేట్ లో బాధితులు వినతిపత్రం ఇస్తే కనీసం పరిశీలన చేయలేదు

 15 డివిజన్లలోనే సహాయం చేయలేనోళ్లు…రాష్ట్రాన్ని ఎలా పాలించగలరు 

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా 

వరద బాధితుల పక్షాన వైసీపీ నిలబడుతుంది 

మేం ధర్నా చేస్తే ఇద్దరు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ సాయం చేసేశామని చెబుతున్నారు

సహాయం అందని వారి జాబితాను గవర్నర్ కు పక్కా ఆధారాలతో సహా ఇచ్చాం 

వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోదా

హెక్టారుకు పదివేలు ఇస్తే సరిపోతుందా 

ఇసుక,మద్యం వాటాలు పంచుకోవడానికే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు 

ఎమ్మెల్యేల ప్రమేయం వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని

చంద్రబాబే చెబుతున్నారు 

ప్రజల కష్టాలు మీకు పట్టవా…దోపిడీనే మీకు కావాలా

వాస్తవాలు రాసినందకు మీడియా గొంతు నొక్కేస్తున్నారు 

సాక్షి పత్రిక పై కేసులు పెట్టారు

ఓట్లు వేయించుకునే వరకూ ఒకలా…ఓట్లు వేశాక మరోలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది 

ఎన్యుమరేషన్ సమగ్రంగా చేపట్టాలి 

మేయర్,రాయన భాగ్యలక్ష్మి

వరద ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ సరిగా జరగలేదు

సచివాలయాల్లో పూర్తి డేటా ఉంటుంది 

కానీ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది 

విరాళాలొస్తే వాటిని పప్పూ బెల్లాల్లా పంచేసుకున్నారు

కృష్ణానదికి 100 మీటర్ల దూరంలో ఉన్న 38వ డివిజన్ ను వరద జాబితా నుంచి తప్పించారు

ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు

విరాళాల సొమ్ము 500 కోట్లు..కేంద్రం ఇచ్చిన 1000 కోట్లు పూర్తిగా బాధితులకు అందించాలి

బాధితులకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగిస్తాం

ఇలాగే వినతిపత్రాలు ఇస్తూనే ఉంటాం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version