ఏ. సి.సి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్య పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలి ఏ సి సి సిమెంట్ కార్మికుల పోరాటం సుదీర్ఘ పోరాటం

0

 తాడేపల్లి

ఏ. సి.సి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్య పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలి

ఏ సి సి సిమెంట్ కార్మికుల పోరాటం సుదీర్ఘ పోరాటం

సీఎం చంద్రబాబుని ,మంత్రి లోకేష ని కలిసి కార్మికుల సమస్యలను వివరిస్తాం

ప్రతీ కార్మికునికి న్యాయం జరిగే వరకు వామపక్ష పార్టీలుగా అండగా ఉంటాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ

ఎ.సి.సి సిమెంట్ కార్మికుల సమస్యను మంత్రి నారా లోకేష్ 

పరిష్కారం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ అన్నారు. 

శనివారం సాయంత్రం తాడేపల్లి బ్రహ్మానందపురంలోని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 1993 వ సంవత్సరం ఎసిసి యాజమాన్యం సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్ చేసిందని ఆయన అన్నారు. గత 40 సంవత్సరాలుగా సిమెంట్ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని కార్మికులు అనేక ఆందోళనలు, నిరసనలు చేసినప్పటికీ, సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ, ప్రభుత్వ అధికారులకు సమస్యను విన్నవించినా కానీ, ఇప్పటివరకు కార్మికులకు నష్టపరిహారం చెల్లించకపోవడం చాలా బాధాకరమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ భూములు అన్యాక్రాంతం కాకుండా ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం జరిగేలా, హైకోర్టు ఆదేశానుసారం ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయిని ప్రభుత్వాలు మారుతున్న 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారం కాకపోవటం చాలా విచారకరమని అన్నారు. 137 ఎకరాల భూమి దాదాపు 14 వందల కోట్ల రూపాయల విలువ గల భూమి ఇక్కడ ఉందని అన్నారు. కార్మికులు ఉపాధి కోల్పోయారని ఉద్యోగాలు కోల్పోయారని వారికి సహాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఏ సి సి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యల గురించి మంత్రి నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి కార్మికుల సమస్యలను వివరిస్తామని 

వీళ్ళందరికీ న్యాయం జరిగేంతవరకు ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. 

ఇక్కడ ఉన్న ప్రతీ కార్మికునికి వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు న్యాయం జరిగే వరకు వామ పక్ష పార్టీలగా పూర్తిగా వారికి అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య,

సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య,తాడేపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య,సిపిఎం నాయకులు బూరగ వెంకటేశ్వర్లు,సీఐటీయూ నాయకులు వేముల దుర్గారావు,

ఏ.సి.సి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకులు స్టీవెన్, 

ఏ.ఐ.ఎఫ్.టి.యూ.న్యూ నాయకులు కె.ఆదినారాయణ,

కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version