కూటమి ప్రభుత్వం తక్షణమే సచివాలయం ఎంప్లాయిస్ వెల్ఫేర్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు పేర్కొన్నారు

0

 కూటమి ప్రభుత్వం తక్షణమే సచివాలయం ఎంప్లాయిస్ వెల్ఫేర్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం, వెటర్నరీ కాలనీ

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు.

ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే వచ్చే ఏప్రిల్ లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలోని ఎపి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్ లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు కే బాబురావు లు పాల్గొని మాట్లాడుతూ తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుండి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జి ఓ ఎం ఎస్ 107 అనుసరించి జాబ్ చార్ట్ అమలు పరచాలని, సెక్రటరీ స్థానంలో ఆఫీసర్ గా హోదాను మార్చాలని, ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని, ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షములో, వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version