కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ అమలు చేస్తు, సుపరిపాలనలో మొదటి అడుగు వేశాం – MLA బొండా ఉమ

0

13-6-2025

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ అమలు చేస్తు, సుపరిపాలనలో మొదటి అడుగు వేశాం – MLA బొండా ఉమ

ధి:13-6-2025 శుక్రవారం సాయంత్రం 6:00″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ అమలు చేస్తు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకుంటూ NDA కూటమి ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేస్తు విద్యార్థి తల్లి ఖాతాలో నేడు నగదు జమచేసిన సందర్బంగా, నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన తల్లులు విద్యార్థులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని కలసి ధన్యవాదాలు తెలియజేసి వారి పిల్లలను ఆశీర్వదించవలసినదిగా కోరగా, MLA బొండా ఉమామహేశ్వరరావు వారిని అభినందించి పిల్లలను ఆశీర్వదించి మిఠాయిలు తినిపించడం జరిగింది

ఈ సందర్భంగా బొండా ఉమ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్ధులకు అమ్మవడి అందించింది అని, NDA కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు ” తల్లికి వందనం కింద” 67,27,164 మంది విద్యార్ధులకు అందిస్తుందని, గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం వర్తింపచేస్తుంది అని.

గత ప్రభుత్వం అమ్మవడి ద్వారా రూ.5,540 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు NDA కూటమి ప్రభుత్వం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తుంది అని, 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకుని, స్కూలు అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని, తల్లి లేని పిల్లలుంటే తండ్రి, సంరక్షులకు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్దేశించిన వారికి నగదు జమ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేశారని.

ప్రైవేటు, అన్ ఎయిడెడ్  పాఠశాలలలో చదివే 76 వేల మందికి కూడా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కరిస్తామని, దీనికోసం ఈ నెల 26 వరకు సమయం ఇస్తున్నామని, 30న తుది జాబితా ప్రకటిస్తామని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నలుగురు పిల్లల ఉన్న తల్లులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తూ ఎకౌంట్లో 60 వేల రూపాయలు జమ చేశారు తెలియజేసారు

ఈ కార్యక్రమంలో ఘంటా కృష్ణమోహన్, 64 డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, 63 డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, బేవర సూర్య, సెంట్రల్ నియోజకవర్గం BC సెల్ అధ్యక్షులు ఇప్పిలి రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, బెజవాడ తిరుపతి, SK బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version