ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ఒక పని అందిరి హృదయాలను గెలుచుకుంది. విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న సమయంలో ఓ మహిళ వేదికపైకి వచ్చారు. ఆమె వచ్చి ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు. అంతే.. అది చూసిన ప్రధాని వెంటనే ఆ మహిళ కాళ్లకు తనూ నమస్కరించారు.
‘మీ కళా ప్రపంచంలో గురువుల కాళ్లకు నమస్కరించడం సహజం. కానీ, రాజకీయాలలో ఇలా చేస్తే దానికి చాలా అర్థాలు చెబుతారు’ అన్నారు ప్రధాని. ఇక తన విషయానికి వస్తే ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.. తనకు ఏదోలా ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే తనకు అసలు నచ్చదని చెప్పుకొచ్చారు. మోదీ చేసిన ఈ పనిపై ఇప్పుడు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలోని సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా ఇకపై మంచి గుర్తింపు లభించనుంది. ఎందుకంటే వారి కోసమే మొదటిసారిగా ఈ ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు సోషల్ మీడియా క్రియేటర్లకు అవార్డులు అందజేయడం జరిగింది.
Spread the love గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ […]
Spread the love అయోధ్య రాముడి దర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కీలక సూచనలు చేసింది. రోజూ లక్షకు పైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారని వెల్లడించింది. భక్తుల సౌకర్యం […]
Spread the love జమ్మూకశ్మీర్‌లో ఆదివారం మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్ జరిగింది. శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం […]