గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పూజిత ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస వదలగా.. ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంజునా పోలీసుల వివరాల ప్రకారం..
ఏపీకి చెందిన పూజిత, హర్యానాకు చెందిన శివం ఉప్లాక్ష్ స్నేహితులు.. ఇద్దరూ గోవా ట్రిప్ కు వచ్చారు. స్థానికంగా బైక్స్ రెంట్ కు ఇచ్చే ఓ షాప్ లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు అంజునాలోని ఓ రెస్టారెంట్ కు బయలుదేరారు. స్కూటీని శివం నడుపుతుండగా పూజిత వెనక కూర్చుంది. స్టార్ కో జంక్షన్ లో స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. దీంతో వెనక కూర్చున్న పూజిత ఎగిరి రోడ్డుపై పడిపోయింది. వెనకే వేగంగా వస్తున్న కారు ఆమె పైకెక్కింది. అయినా డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో పూజిత శరీరం నలిగిపోయింది.
దాదాపు వంద మీటర్ల వరకు కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. శివం కూడా గాయాలపాలయ్యాడు. స్థానికులు వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పూజిత అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. శివంను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, పూజిత డెడ్ బాడీని బంబోలిమ్ లోని మెడికల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, పోస్టుమార్టం చేశాక ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అంజునా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సమ్రీన్ భవానీని అదుపులోకి తీసుకుని ప్రమాదం జరిగిన తీరుపై విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
Spread the love లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహించగా రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇటీవల జరిగిన […]
Spread the love చైనాలో పనికోసం వెళ్లిన పాలమూరు వాసి ఒకరు అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. మరో నాలుగు రోజుల్లో భారత్ కు తిరిగి రావాల్సి ఉండగా అంతలోనే మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లా […]
Spread the love ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్‌కుమార్, […]