ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేక బెంచ్ కు సీజేఐ చంద్రచూడ్ కేటాయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ద్వివేదీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించనుంది.
నిన్న రాత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను నిన్న విచారించిన ఢిల్లీ హైకోర్టు… ఈడీ అరెస్ట్ నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు రెండు గంటల విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి ఈడీ కోరే అవకాశం ఉంది.
Spread the love ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ఒక పని అందిరి హృదయాలను గెలుచుకుంది. విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న […]
Spread the love ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్‌కుమార్, […]
Spread the love జమ్మూకశ్మీర్‌లో ఆదివారం మొట్టమొదటి ఫార్ములా-4 ఈవెంట్ జరిగింది. శ్రీనగర్ వేదికగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం […]