మిత్ర ధర్మాన్ని పాటిస్తూ
ప్రజా సమస్యలపై గళమెత్తాలి బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఎమ్మెల్యే సుజనా చౌదరి
మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు పీ.వీ. ఎన్ మాధవ్ కు ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పీ. వీ.ఎన్ మాధవ్ ను బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. విజయవాడ
బందర్ రోడ్ లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ అభినందన సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,మాజీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీ ఎం రమేష్, రాజ్యసభ సభ్యులు, పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి,మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి ) తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ
ఏపీ లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా మాధవ్ కృషి చేయాలన్నారు
ముఖ్యంగా యువతను, మహిళలను ఆకర్షించేలా ప్రయత్నాలను కొనసాగించాలన్నారు .
మహిళా రిజర్వేషన్ల ద్వారా మహిళలు రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉందన్నారు.సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ బిన్నాభిప్రాయం నుంచి ఏకాభిప్రాయానికి తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.
ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనలోనే దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మాధవ్ ఏపీ బీజేపీ అధ్యక్షుడి గా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ప్రజా గళం వినిపించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని వైసీపీ ఐదేళ్ల అరాచక పాలన వలన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మాధవ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ పదవికి వన్నె తెచ్చేలా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు