ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్.ఓ.సీ లను అందజేసిన
బీజేపీ రాష్ట్ర నాయకులు
కే రవి చంద్ర రెడ్డి,
బీజేపీ అధికార ప్రతినిధి
ఆర్ డీ విల్సన్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి లను
బుధవారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవి చంద్ర రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డీ విల్సన్,కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి
బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
46 వ డివిజన్ సాయిరాం సెంటర్
కు చెందిన బెవర కోమల( 42) గొంతు ట్యూమర్ తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .
తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో వారు ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేయగా
రూ 3 లక్షల 20 వేల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు
అదేవిధంగా 44 వ డివిజన్ చెరువు సెంటర్ కు చెందిన గంగుల ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అత్యవసర వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 3 లక్షల 39 వేల ఎల్. ఓ.సీ ను అందజేశారు ..
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 44 వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు, కూటమి నేతలు అవ్వారు బుల్లబ్బాయి, గన్నవరపు శ్రీనివాస్, మైనంపాటి రమేష్, బొడ్డు నాగలక్ష్మి, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్ , కొల్లి దుర్గారావు , టీ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు