10-06-2025 ఎం.పి కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలువిజయవాడ బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ చైర్మన్, హిందుపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తెలుగు మహిళలు,టిడిపి నాయకులు, తెలుగు యువత విద్యార్ధులు , కార్యకర్తలు ఆనందోత్సహల మధ్య కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఎంతో మంది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న కల్మషం లేని వ్యక్తి హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అంటూ కొనియాడారు. బసవతారకం కేన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అనేక మంది క్యాన్సర్ రోగులకు ప్రాణదానం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ , ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, విజయవాడ పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి చిట్టా నిర్మల, టిడిపి నాయకులు బొప్పన భవనకుమార్, వల్లభనేని నరసింహాచౌదరి, పేటెటి రాజమోహన్, కిలారి చంద్రశేఖర్,బొర్రా గాంధీ, మాదిగాని గురునాథం,కాకు మల్లిఖార్జునరావు, సంకె విశ్వనాథం, పరిశపోగు రాజేష్, ఎమ్.డి. ఇర్ఫాన్, అబీద్ హుస్సెన్,, తెలుగు మహిళ నేతలు రాయి రంగమ్మ, వీరపనేని అరుణ, ఎస్.సున్నాబి, మొకరు రంగ మహాలక్ష్మీ, ఎస్.అమీనా, జి.పండు, ఎస్.కె.ఫాతిమా, గౌరి, శైలు, ఎస్.కె.రమీజా, కె.స్రవంతి, మాదాల రాజ్యలక్ష్మీ, మాదాల సత్య లతో పాటు తెలుగు యువత విద్యార్ధులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.