ఈనెల 7 నాటికి పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ పూర్తికావాలి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

0

 ఎన్టీఆర్ జిల్లా, మార్చి 4, 2025

ఈనెల 7 నాటికి పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ పూర్తికావాలి

జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

 

జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణ ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తి కావాలని.. తద్వారా జిల్లాలోని అన్ని పీఏసీలు ఈ – పీఏసీలు (e-PACS)గా మార్పు చెందాలని తద్వారా ప్రజలకు కాగితపు రహిత ఆన్లైన్ సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ వారికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అలసత్వం వహించిన ఆడిటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి డా. ఎస్.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సహకార ఆడిట్ అధికారి సీహెచ్ శైలజ, విభాగ సహకార అధికారి పి.కిరణ్ కుమార్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ జి రంగబాబు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version