ఆలపాటి రాజేంద్రప్రసాద్ అఖండ మెజార్టీ విజయం హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

0

 ఆలపాటి రాజేంద్రప్రసాద్ అఖండ మెజార్టీ విజయం హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

కృష్ణ-గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ 82 వేల 320 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించడం పట్ల ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపును ప్రజల గెలుపుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ, “ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు టీడీపీ పై పట్టభద్రులకు ఉన్న అభిమానం, నమ్మకానికి ప్రతీక అని అభివర్ణించారు. ఈ విజయం కూటమికి మరింత బలాన్ని తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేలు చేసే నాయకత్వానికి ప్రజలు తగిన గుర్తింపు ఇస్తారని మరోసారి రుజువైంది” అని అన్నారు. వైసీపీ అసత్య ప్రచారాలను పట్టభద్రుల తిప్పికొట్టారని అన్నారు. ప్రగతికి, అభివృద్ధికి ఓటు వేయండని చెప్పామని, ఆ మేరకు విద్యావంతులు ఓట్లు వేశారని వివరించారు. ఈ ఘన విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త, నేతలకు అభినందనలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version