
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంలో భాగంగా జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. జీహెచ్ హెచ్ ప్రారంభోత్సవానికి వచ్చి ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కేంద్రమంత్రికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలకు సంబంధించిన అంశంపైనా వారు చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
![]()
