ఘనంగా చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

ఘనంగా చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, పున్నమ్మ తోట చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్ 1975-76 సంవత్సరం లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ళ తరువాత కలుసుకున్నారు.

శనివారం కానూరు లోని ది సోషల్ యార్డ్ ఫంక్షన్ హాల్ లో సమావేశమయ్యారు..

ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్నేహితులను ఆత్మీయంగా పలకరించారు.. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని జన్మ భూమికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు

రాజ్య సభకు ఎంపికై 12 ఏళ్లు సేవలు అందించానని పశ్చిమ నియోజక వర్గాన్ని ప్రతిష్టాత్మకంగా (ఛాలెంజ్ గా) తీసుకొని పోటీ చేసి గెలుపొందానని ఈ సందర్భంగా సుజనా గుర్తు చేశారు.

ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చేటప్పుడు కులం, మతం, కంటే వారి సమర్ధత, సామర్ధ్యాలే ప్రామాణికంగా ఉండాలన్నదే తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు..

దురదృష్టవశాత్తు చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్ లేకపోవడం బాధాకరమన్నారు..

అందరం కలిసి ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్దామని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎమ్మెల్యే సుజనా పిలుపునిచ్చారు..

Loading