వ్యవసాయ శాఖ –
AGILE అజైల్ ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా వినియోగించాలి –
బుడితి రాజశేఖర్, ఐ.ఏ.ఎస్.ప్రత్యేక కార్యదర్శి వ్యవసాయ & సహకారం.
AGILE వ్యవసాయ ఇన్‌పుట్ లైసెన్స్ ఇంజిన్ యాప్ ప్రారంభం
వేదిక: సచివాలయం, వెలగపూడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ అభివృద్ధిలో మరో కీలకమైన ముందడుగు వేసింది. AGILE (Agriculture Input License Engine) యాప్‌ను శ్రీ బుడితి రాజశేఖర్, ఐ.ఏ.ఎస్. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయ శాఖ), ఈరోజు సచివాలయంలో అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజశేఖర్, విత్తనాలు ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ వనరుల లైసెన్సింగ్ వ్యాపారానికి సంబంధించిన అన్ని భాగస్వాములు AGILE ప్లాట్‌ఫామ్‌ను తప్పనిసరిగా అనుసరించి, సక్రమంగా వినియోగించాలంటూ తెలిపారు. ఇది ఒక నవీకరించబడిన, అభివృద్ధి చెందిన, కేంద్రీకృత డిజిటల్ ఇన్‌పుట్ మేనేజ్‌మెంట్ సిస్టం అని పేర్కొన్నారు.
AGILE ప్లాట్‌ఫామ్ విశేషాలు:
ఎస్. డిల్లీ రావు, ఐ.ఏ.ఎస్., వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ, AGILE అనేది కొత్త తరం సంపూర్ణ లైసెన్సింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అని తెలిపారు. ఇది కాగిత రహిత, పారదర్శక, ప్రామాణికమైన వ్యవస్థగా పనిచేస్తుందని వివరించారు.
AGILE ముఖ్యాంశాలు:
రియల్ టైమ్ మానిటరింగ్ డాష్‌బోర్డ్:
అధికారులు, పాలకులు లైసెన్సింగ్ స్థితిని ప్రత్యక్షంగా గమనించగల సౌకర్యం.
ఆధునిక నివేదికలు, విశ్లేషణలు:
ప్రణాళికలు, పాలనా పర్యవేక్షణ, పథకాల సమీక్షకు అనుకూలంగా వివరణాత్మక నివేదికలు.
సప్లై చైన్ మేనేజ్‌మెంట్:
ఇన్‌పుట్ పంపిణీపై ప్రత్యక్ష నిఘా, తయారీదారులు, డీలర్లు, రిటైలర్ల మధ్య సమన్వయం.
) ఇ-గవర్నెన్స్ ఇంటిగ్రేషన్:
ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ, ఎస్ఎంఎస్/ఇమెయిల్ సమాచారం, డిజిలాకర్, పేమెంట్ గేట్‌వేలు, డీలర్ నెట్‌వర్క్‌కు GIS మ్యాపింగ్.
) వినియోగదారులకు అనుకూలమైన ఆన్‌లైన్ పోర్టల్‌లు:
రైతులు, డీలర్లు, సంస్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, తమ లైసెన్సుల స్థితిని తెలుసుకునే సౌలభ్యం ఈ విధానం ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపారు .
పాల్గొన్న అనుబంధ ఉన్నత అధికారులు
ఈ కార్యక్రమంలో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు:
కె. శ్రీనివాసులు, ఐ.ఏ.ఎస్., ఉద్యాన సంచాలకులు
టి. విజయకుమార్, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్), కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, రైతు సాధికార సంస్థ
డా. కె. గోపాల్, వైస్ ఛాన్సలర్, ఉద్యాన విశ్వవిద్యాలయం
డా. శారద జయలక్ష్మి, వైస్ ఛాన్సలర్, ఏఎన్‌జీఆర్‌ఏయూ రంగా విశ్వవిద్యాలయం
కార్యక్రమ సమన్వయకర్తలుగా జేడీఏలు వి.డి.వి. కృపాదాస్, విజయభారతి, బాలసుబ్రహ్మణ్యం, డీఏఓ విజయకుమారి, ఏడీఏ ప్రేం శేఖర్ వ్యవహరించారు.
మహిళా డీలర్‌కు తొలి డిజిటల్ లైసెన్స్
కార్యక్రమ ముగింపు సందర్భంగా బుడితి రాజశేఖర్, స్పెషల్ సీఎస్, తొలి డిజిటల్ ఎరువుల తయారీ లైసెన్సును పలు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా డీలర్ శ్రీ ఆధ్య అగ్రో కెమికల్స్, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా సంస్థకు మంజూరు చేశారు.