ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ఒక పని అందిరి హృదయాలను గెలుచుకుంది. విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న సమయంలో ఓ మహిళ వేదికపైకి వచ్చారు. ఆమె వచ్చి ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు. అంతే.. అది చూసిన ప్రధాని వెంటనే ఆ మహిళ కాళ్లకు తనూ నమస్కరించారు.
‘మీ కళా ప్రపంచంలో గురువుల కాళ్లకు నమస్కరించడం సహజం. కానీ, రాజకీయాలలో ఇలా చేస్తే దానికి చాలా అర్థాలు చెబుతారు’ అన్నారు ప్రధాని. ఇక తన విషయానికి వస్తే ఎవరైనా తన కాళ్లకు మొక్కితే.. తనకు ఏదోలా ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే తనకు అసలు నచ్చదని చెప్పుకొచ్చారు. మోదీ చేసిన ఈ పనిపై ఇప్పుడు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలాఉంటే.. దేశంలోని సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా ఇకపై మంచి గుర్తింపు లభించనుంది. ఎందుకంటే వారి కోసమే మొదటిసారిగా ఈ ‘నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు సోషల్ మీడియా క్రియేటర్లకు అవార్డులు అందజేయడం జరిగింది.
Spread the love అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, 19 వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వ వేటువేసింది. నిషేధం విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. వీటితో […]
Spread the love ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు […]
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను […]