కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది.
“గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్‌సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి.. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి.. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి.. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి.. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి” అని ముద్రగడ తన లేఖ ద్వారా తెలియజేశారు.
Spread the love-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు సొమ్ము జమ. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 05.12.2025. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత […]
Spread the love దార్మికతను కాపాడుకుందాం ఆత్మీయ సమ్మేళనంలో సుజనా ఆధ్యాత్మిక పరంగా అందరం ధార్మికత ను కాపాడుకుందాం అని పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారుహిందూ […]
Spread the loveవిజయవాడ నగరపాలక సంస్థ06-11-2025 గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ కచ్చితంగా జరగాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ కచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ […]