ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి రజని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి సంబంధించి మంత్రి రజని, సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవినీతి సొమ్ముతో గెలవొచ్చని పగటి కలలు కంటున్నారని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు. ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ, మరోవైపు అభ్యర్థులను డబ్బులు గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టికెట్ల అమ్మకాల్లో సజ్జల సీఎం జగన్ కు బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని, టికెట్ల అమ్మకాలతో ఇప్పటివరకు రూ.1000 కోట్లను సజ్జల తాడేపల్లి ప్యాలెస్ కు పంపించారని ఆరోపించారు.
Spread the love సెంట్రల్లో ముగ్గురు రౌడీషీటర్లు మనకు అవసరమా- ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఉమా పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టిడిపి నేత […]
Spread the love ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సుఖేశ్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించాడు. జైలు […]
Spread the love ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగియడంతో శ్రీ కనకదుర్గ […]