ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్‌కుమార్, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సుఖ్‌భీర్ సింగ్ సంధులను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కమిటీ సభ్యులలో ఒకరయిన కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరీ మీడియాతో వెల్లడించారు. ఇక లోక్ సభ ఎన్నికల ముందు ఇటీవల అరుణ్ గోయల్ తన ఎలక్షన్ కమిషనర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అలా అరుణ్ గోయల్ తప్పుకున్న రోజుల వ్యవధిలోనే ఈ కొత్త నియమకాలు జరగడం గమనార్హం.
అలాగే ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం ఏర్పడిన సెలక్షన్ కమిటీ ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి నియామకాలు కూడా ఇవే. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఇంక కొన్ని రోజులే ఉందనగా ఎలక్షన్ కమిషర్ అనుప్ పాండే ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీవిరమణ చేశారు. అటు అరుణ్ గోయల్ తన ఎలక్షన్ కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ముగ్గురు సభ్యులు ఉండే కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో తాజాగా ఇద్దరు కమిషనర్లను సెలక్షన్ కమిటీ నియమించింది.
కాగా, ఈ సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఎలక్షన్ కమిషన్ భేటీ అయింది. అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంశాఖ కార్యదర్శి, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన పేర్ల జాబితాపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.
Spread the love ప్రధాన యుద్ధ ట్యాంకుల కోసం దేశీయంగా తయారు చేసిన మొట్టమొదటి 1500 హెచ్‌పీ (హార్స్ పవర్) ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ ప్రకటించింది. కర్ణాటకలోని మైసూరులో బీఈఎంఎల్ ఇంజన్ […]
Spread the love అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. […]
Spread the love 16.05.2024 మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం వివరాలు జూన్ 4 వచ్చే ఫలితాలను చూసి జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ షాక్ […]