జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారనే సస్పెన్స్‌కు తెరపడింది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన గురువారం స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టతనిచ్చారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు.
2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని అన్నారు. అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. కాగా గత ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి, రెండు చోట్లా పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Spread the love బిజెవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం అమరావతి *ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో వేలకోట్లు కేటాయించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం […]
Spread the love విజయవాడ నగరపాలక సంస్థ 26-09-2024 చారిత్రాత్మక ప్రదేశాలలో స్వచ్ఛత హి సేవ స్వచ్ఛ్ విజయవాడ ప్రజల సహకారం, భాగస్వామ్యం తో సాధ్యం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగర […]
Spread the love 42వ డివిజన్లో స్థానికపెన్షన్పొందేలబ్ధిదారులైనటువంటి వృద్ధులు చేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేపించారు ఈరోజు 42వ డివిజన్లో వర్క్ షాప్ రోడ్ లోని అన్న క్యాంటీన్ దగ్గర 42 తెలుగుదేశం […]