పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. సోమవారం కరాచీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించి ఇస్లామాబాద్ మూడో సారి టైటిల్ గెలుచుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి ఇస్లామాబాద్ విజయం సాధించడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్ ఇమాద్ వసీం 5వికెట్లు తీశాడు.
ఆ తర్వాత 160 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌ను న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ అర్ధ శతకం (50) తో విజయం దిశగా నడిపించాడు. చివరలో ఆ జట్టు బౌలర్ నసీం షా (17) మెరుపు బ్యాటింగ్‌తో ఇస్లామాబాద్ విజయం సాధించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది.
Spread the love టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మళ్లీ కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత […]
Spread the love ఎన్టిఆర్ జిల్లా తేది:22.05.2024 విజయవాడ ` మచిలీపట్నం జాతీయ రహదారి బెంజ్ సర్కిల్ నుండి ఆటోనగర్ మార్గంలో డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జాతీయ […]
Spread the loveవిజయవాడ, తేది: 20.11.2025 • ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం• ఘనంగా 5 వ ఆడిట్ దివస్ వేడుకలు ప్రారంభం• నవంబర్ 20 నుండి 28 వరకు వేడుకల నిర్వహణ• […]