ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సుఖేశ్ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించాడు. జైలు నుంచి లేఖ విడుదల చేశాడు. ‘కవిత అక్కయ్య’ అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డాడు. “లిక్కర్ స్కామ్ కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులని, రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లూ నీవు చేసిన వాదన అబద్ధమని తేలిపోయింది. మీ పార్టీ వేలకోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బాలన్న మీ కథలపై దర్యప్తు జరుగుతోంది” అని సుఖేశ్ లేఖలో పేర్కొన్నాడు.
![]()

