వైసీపీకి షాకు మీద షాకులు సుజనాకు జై కొడుతున్న నేతలు సుజనాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు

Spread the love

 వైసీపీకి షాకు మీద షాకులు

సుజనాకు జై కొడుతున్న నేతలు

సుజనాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు

విజయవాడ పశ్చిమలో వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనాకు వివిధ సంఘాలు, పార్టీల నేతలు మద్దతు పలుకుతున్నాయి. సుజనా చౌదరికి మద్దతుగా బీసీ లు బుధవారం భారీగా తరలి వచ్చారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయం వీరి రాకతో కిటకిట లాడింది. ఏపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇన్ చార్జ్ యరగాల నూకానమ్మ యాదవ్ నేతృత్వంలో మహిళలు, బీసీ నాయకులు వందల సంఖ్యలో తరలివచ్చి సుజనా చౌదరికి మద్దతు తెలిపారు. బీజేపీలో చేరారు. కులాలు మతాలకు అతీతంగా ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం ప్రకటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సుజనా చౌదరి అన్నారు. బీసీలను జగన్ మోసం చేశారని, ఎన్డీఏ కూటమితోనే బీసీల సంక్షేమం సాధ్యమని, సుజనా గెలిచి మంత్రి కావడం ఖాయమని, నూకానమ్మ యాదవ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుజనా చౌదరికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కనిశెట్టి లక్ష్మణరావు, మాజీ మేయర్ తాడి శకుంతల, భానుప్రకాష్, తమ్మున దుర్గారావు, ఆదిత్య, రాజేష్, పీసా కుట్టి తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *