విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ జయకేతనం
విజయవాడ:
విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపొందారు. వైసిపి అభ్యర్థి భాగ్యలక్ష్మి పై 1,30, 872 ఓట్ల మెజారిటీతో జయ కేతనం ఎగురవేశారు. వంగవీటి రాధాకృష్ణకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా, భాగ్యలక్ష్మి కి 1,35,016 ఓట్లు వచ్చాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేవలం 12,642 ఓట్లే దక్కాయి.దీంతో కలుపుకుని జనసేన రెండు కార్పొరేషన్లలో విజయం సాధించింది.
![]()
