విజయవాడ సెంట్రల్‌లో చరిత్రాత్మక విజయం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ సెంట్రల్‌లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం.. 29 స్థానాలకు 28 స్థానాల్లో విజయం.. ప్రజల నమ్మకమే మా బలం
ప్రజలు ఇచ్చిన విజయాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తాం.. బొండా ఉమా
సెంట్రల్‌లో కూటమి విజయదుందుభి.. గెలుపొందిన కార్పొరేటర్లకు బొండా ఉమా గారు , బొండా సిద్ధార్థ ఘన సన్మానం
యువతకు రాజకీయాల్లో పెద్దపీట.. ఎంపీ, ఎమ్మెల్యేలు, 86 మంది కార్పొరేటర్లతో విజయవాడ అభివృద్ధికి సమష్టి కార్యాచరణ
ధి:-4-11-2026 ఈరోజు బుధవారం ఉదయం 10:00″గం లకు” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో NDA కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించిన సందర్భంగా గెలుపొందిన కార్పొరేటర్ లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్దార్ధ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు….
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు అద్భుతమైన విజయాన్ని అందించి తమ ఆశీర్వాదాలను అందించారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 27 నెలలుగా రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం చేస్తున్న కృషికి ప్రజలు తమ తీర్పు ద్వారా మద్దతు పలికారు.
ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో పనిచేస్తాం. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 29 కార్పొరేటర్ స్థానాలకు గాను 28 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం చారిత్రాత్మకం. 100 శాతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగిన మా ప్రయాణంలో ప్రజలు అందించిన ఈ భారీ విజయం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది, ఈ చారిత్రాత్మక విజయాన్ని భవిష్యత్తులోనూ నిలబెట్టుకుంటూ విజయవాడ సెంట్రల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం.
యువతకు రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన. అందులో భాగంగానే కూటమిలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున వంగవీటి రాధాకృష్ణ వంటి అనుభవం కలిగిన యువ నాయకులకు అవకాశం కల్పించడం సంతోషకరం.
రాబోయే రోజుల్లో విజయవాడ నగర అభివృద్ధి కోసం ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్‌తో పాటు 86 మంది కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేస్తాం. పార్టీలకు అతీతంగా నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం. యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారి భాగస్వామ్యంతో విజయవాడను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం.
ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
![]()
