
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన 53వ డివిజన్ కార్పొరేటర్ గౌడిపేరు సుధీర్ కుమార్
విజయవాడ నగరపాలక సంస్థ (VMC) స్థానిక సంస్థల ఎన్నికల్లో 53వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన గౌడిపేరు సుధీర్ కుమార్ నేడు బ్రాహ్మణ వీధిలోని మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపునకు సహకరించినందుకు, అండగా నిలిచినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నూతన కార్పొరేటర్ గౌడిపేరు సుధీర్ కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. డివిజన్ ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
డివిజన్ అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందని, ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు.
ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]()
