
69, 70, 72, 75వ డివిజన్లలో NDA కార్పొరేటర్ అభ్యర్థుల కూటమి ఎన్నికల ప్రచార రోడ్‌షో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతాం– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
ధి :-24-10-2026 శనివారం సాయంత్రం 5:00 గంటలకు లోటస్ ల్యాండ్‌మార్క్ మెయిన్ గేట్ నుంచి 69, 70, 72, 75వ డివిజన్ల పరిధిలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార రోడ్‌షో కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ మేయర్ అభ్యర్థి, ఎన్డీఏ కూటమి బలపరిచిన వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ:- నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని తెలిపారు.
నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయం అవసరమని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
రోడ్‌షో సందర్భంగా స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
![]()
