పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వంBLC పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం

రాజీవ్ నగర్లో 50 మంది లబ్ధిదారులకు రూ.1.25 కోట్ల విలువైన లెటర్లు అందజేసిన -MLA బొండా ఉమా
ధి :-7-10-2026 ఈరోజు బుధవారం ఉదయం 9:40″గం లకు” 63వ డివిజన్ రాజీవ్ నగర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం సమీప గ్రౌండ్ నందు 50మందికి ₹1.కోటి 25 లక్షల రూపాయలు PMAY 2.0 (BLC) పథకం ద్వారా లబ్ధిదారులకు లెటర్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు…
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ :- గతంలోనూ ఈ రాజీవ్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అని, రోడ్డు మార్గాలు నివసించేందుకు అనువుగా లేనటువంటి వెళ్ళను పేదవారికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్న వందల మందికి 2014 TO 2019 మధ్య తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో BLC ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూర్చామని…
తర్వాత వచ్చినటువంటి వైసిపీ ప్రభుత్వంలో ఇటువంటి BLC పథకాన్ని అమలు చేయలేదని దాని ద్వారా ఎంతోమంది నిరుపేదలు ఇల్లు కట్టుకునేవారు, ఒక పక్కన ఇసుక, అందక ఇబ్బంది పడ్డారని, కనీసం ప్రభుత్వం నుండి సహాయం అందక బాధపడ్డారని…
2024 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం పేద ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోంది, పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు BLC పథకం ద్వారా రూ.2.50 లక్షల వరకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తోంది.
అలాగే ప్రభుత్వ స్థలాల్లో 30, 50, 100, 150 గజాల వరకు నివాసం ఉంటున్న పేదలకు తన కృషితో G.O నెం.30 ద్వారా శాశ్వత హక్కులు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది, పేదలకు ఇళ్ల పట్టాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో భరోసా కల్పిస్తోంది, ఇటీవల విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు అందించడం సంతోషకరమైన విషయం, పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పేద వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు మొత్తం 1,000 మంది లబ్ధిదారులకు BLC పథకం ద్వారా రూ.2.50 లక్షల చొప్పున గృహ నిర్మాణ సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉంది, ప్రతి డివిజన్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, డివిజన్ నాయకుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సహాయం అందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా పేదలు, మహిళల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడానికి కృషి చేస్తాం అని తెలియజేసారు…
ఈ కార్యక్రమంలో:- డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠరావు , లబ్బా దుర్గ, డివిజన్ ఇంచార్జ్ మోతుకూరి కాసిం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, పెద్ది శ్రీను మోదుగుల గణేష్, చిగుళ్ల నాగమణి, బైరి శీను, పెద్ది శ్రీను, బత్తుల కొండ, Sk మెహర్, బాజీ, తదితరులు పాల్గొన్నారు…
![]()
